ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా నిఘా వర్గాలు కృషి చేశాయిః ఒబామా

యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని పెకిలించివేయొచ్చన్న ఒబామా

Obama hails US strike killing Ayman al-Zawahiri, al-Qaeda ..

న్యూయార్క్‌ః అమెరికా అల్‌ ఖైదా చీఫ్ అల్ జవహరిని అంతం చేసిన సంగతి తెలిసిందే. డ్రోన్ దాడితో ఆయనను హతమార్చింది. ఈ నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం చేయకుండానే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయవచ్చని చెప్పడానికి అల్ జవహరి ఘటనే ఉదాహరణ అని చెప్పారు.

జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు శాంతి లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఒక్క సాధారణ పౌరుడి ప్రాణానికి కూడా హాని కలగకుండా జవహరిని అంతం చేసినందుకు ప్రెసిడెంట్ జో బైడెన్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్షణం కోసం రెండు దశాబ్దాలుగా అమెరికా నిఘా వర్గాలు కృషి చేశాయని కొనియాడారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/