పోషకాలు పుష్కలం

పండ్లు- ఆహారం – ఆరోగ్యం

Nutrients in guava fruit
Nutrients in guava fruit

జామ పండుని ఎలా తిన్నా.. రుచితో పాటు పోషకాలూ పుష్కలంగా ఉంటాయి.. వీటితో పిల్లలకు జెల్లీలు జామ్ లు, మరెబ్బలు వంటివి చేసి ఇవ్వొచ్చు.

ఈ పండు నుంచి విటమిన్ సి, లైకోపీన్, యాంటీ ఆక్సీడెంట్స్ విరివిగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువుగా ఉండేవారు రోజూ ఒక జామ పండు తింటే చాలు. ఇందులోని మెగ్నీషియం.. మనం తీసుకునే ఇతర ఆహార పదార్ధాల్లోని పోషకాలను సరిగా స్వీకరించటానికి సహకరిస్తుంది. యాంటీ ఆక్సీడెంట్స్ ప్రీ రాడికల్స్ ను బయటకు పంపటంలో కీలకంగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి.

ఎక్కువ పీచు, తక్కువ గైనమిక్ ఇండెక్స్ ఉండే జామపళ్ళు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.. సోడియం పొటాషియం నిల్వలను సమన్వయ పరచి రక్తపోటుని అదుపులో ఉంచుతాయి.. ఇందులోని పోషకాలు ట్రిగ్లీరాయిడ్స్, చేదు కొవ్వుని తగ్గించటంలో కీలకంగా పనిచేస్తాయి.. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

డైటరీ ఫైబర్ ఎక్కువగా లభించే ఈ పండుని తినటం వల్ల మలబద్ధకం సమస్య అదుపులోకి వస్తుంది.. ఒక జామ పండుని తింటే రోజుకి అవసరమైన 12 శాతం పీచు శరీరానికి అందుతుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ సక్రమంగా సాగుతుంది.. దీని నుంచి లభించే విటమిన్ ఏ కంటి చూపుని కాపాడుతుంది.. కేటరాక్ట్ వంటి సమస్యలు పెరగకుండా అడ్డుకుంటుంది.. దీనిలో లభించే ఫోలిక్ ఆసిడ్ లేదా విటమిన్ గర్భిణీలను మేలు చేస్తుంది.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/