రతన్‌ టాటాకు భారీ ఉపశమనం

రూ.3 వేల కోట్ల పరువు నష్టం దావా ఉపసంహరణ

Nusli wadia & Ratan tata
Nusli wadia & Ratan tata

ముంబయి: బాంబే డైయింగ్ చైర్మన్ నస్లీ వాడియా సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. టాటా గ్రూప్‌కు చెందిన రతన్ టాటా సహా ఇతరులపై ఇదివరకు రూ.3వేల కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ దావాను ఇప్పుడు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు పరువు నష్టం దావాలను అన్నింటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో వాడియా టాటా యుద్ధానికి తెరపడినట్లేనని భావిస్తున్నారు. పరిణితి చెందిన వ్యక్తులుగా ఇద్దరు కూడా కేసులను పరిష్కరించుకోవాలని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే సూచించారు. దీంతో సోమవారం ఈ పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉన్న వాడియాను పరువు తీసే ఉద్దేశ్యం తమకు లేదని టాటా ప్రకటన చేశారు. దీంతో పిటిషనర్ ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని బెంచ్ సూచించింది. తాజాగా వాడియా పరువు నష్టం దావాలను ఉపసంహరించుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/