ఈ ఏడాది 1.83 లక్షలు పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు

పార్లమెంటులో వివరించిన విదేశాంగ సహాయమంత్రి

passport

న్యూఢిల్లీః మన దేశ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాల్లో సెటిల్ అవుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. గత కొన్నేళ్లుగా మన పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్యను కేంద్రం వివరించింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఎంత మంది మన సిటిజెన్ షిప్ ను వదులుకున్నారో వివరించింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ సహాయమంత్రి వి.మురళీధరన్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1.83 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని ఆయన తెలిపారు. గడచిన సంవత్సరాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని చెప్పారు. 2021 లో 1.63 లక్షల మంది… 2020లో 85 వేల మంది… 2019లో 1.44 లక్షల మంది… 2018లో 1.34 లక్షల మంది… 2017లో 1.33 లక్షల మంది… 2016లో 1.41 లక్షల మంది… 2015లో 1.31 లక్షల మంది పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/