భారత్, పాక్ ల మధ్య అణుయుద్ధం రాదు

స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్లు అవుతున్నా.. 

Trump with Imran Khan
Trump with Imran Khan

వాషింగ్టన్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమయ్యారు. భారత్, పాక్ ల మధ్య అణుయుద్ధం రాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చిచెప్పారు. భార‌త్ త‌న అణ్వాయుధ స‌మీక‌ర‌ణ నిలిపివేస్తేనే , తాము కూడా ఆపేస్తామ‌ని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్లు అవుతున్నా.. క‌శ్మీర్ స‌మ‌స్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోలేమని ఆయన చెప్పారు. కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించేందుు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇమ్రాన్ స్వాగతించారు.వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముష్రరఫ్ కశ్మీర్ సమస్యపై ఓ తీర్మానం చేసేందుకు అంగీకరించారని, ఆ తరువాత ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఇమ్రాన్ తెలిపారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని, ట్రంప్ పాత్ర కీలకంగా ఉంటుందని ఇమ్రాన్ పేర్కొన్నారు. 130 కోట్ల మందికి సంబంధించిన కశ్మీర్ సమస్యపై చర్చిస్తున్నామని, ఒకవేళ శాంతి కుదిరితో ఇరు దేశాలకు లాభాలే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. శాంతియుత మార్గంలో కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని తాను ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/