ఆస్కార్ నామినేషన్లో ఎన్టీఆర్ కు నిరాశ ఎదురైంది

95 వ ఆస్కార్ నామినేషన్లలో జూ. ఎన్టీఆర్ కు నిరాశ ఎదురైంది. బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ నామినేషన్ లలో ఎన్టీఆర్ కు చోటు దక్కలేదు. నిన్నటి వరకు అనేక వెబ్ సైట్స్ , పలు నేషనల్ చానెల్స్ లలో ఆస్కార్ అవార్డ్స్ లలో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ లలో ఎన్టీఆర్ కు చోటు దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారం చూసి అభిమానులతో పాటు చాలామంది ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డు వస్తుందని భావించారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చోటు దక్కలేదు. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కింది.

తెలుగు సినిమా పాట నమోదైంది. బాహుబలి తో తెలుగు సినిమా సత్తా చాటిన దర్శక ధీరుడు రాజమౌళి..ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ బరిలోకి తెలుగు సినిమా ను తీసుకెళ్లాడు. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ ను దక్కించుకున్న ఆర్ఆర్ఆర్..ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో నిలువడం విశేషం.

ఆస్కార్ అవార్డుల నేపథ్యంలో నేడు తుది నామినేషన్లు ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్… ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు కేటగిరీల్లో నిరాశపరిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఈ రెండు కేటగిరీల్లో నామినేషన్ దక్కలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ ఖరారైంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది. నాటు నాటు పాటకు కీరవాణి బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట చోటు దక్కించుకుంది. ఇదే కాకుండా, ఈ కేటగిరీలో హోల్డ మై హ్యాండ్ (టాప్ గన్ మావెరిక్), దిసీజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్), అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్) గీతాలు కూడా ఆస్కార్ తుది నామినేషన్లలో చోటు దక్కించుకున్నాయి. ఇక, అవతార్ సీక్వెల్ అవతార్: ద వే ఆఫ్ వాటర్ చిత్రం ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకుంది.

గత ఏడాది మార్చి 25న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించగా.. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లని కొల్లగొట్టింది.