ఎవరు మీలో కోటీశ్వరులు పూర్తి చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే . ఈ షో కు సామాన్య ప్రజలే కాక సినీ ప్రముఖులు సైతం హాజరై ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సీజన్ కు సంబదించిన షూటింగ్ పూర్తి చేశారట. సీజన్ 1కు సంబంధించి నిర్వాహకులు మొత్తం 60 ఎపిసోడ్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 37 ఎపిసోడ్లు టీవీలో టెలీకాస్ట్ అయ్యాయి. మరో 23 షోలకు సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఇక ఈ సీజన్ కు గాను ఎన్టీఆర్ రూ.7.5 కోట్లను రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్.

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది చిత్ర యూనిట్. జనవరి 07 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ సెట్స్ ఫై ఉండగానే కొరటాల శివ డైరెక్షన్లో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో వీరిద్దరి కలయికలో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.