కేక పుట్టిస్తున్న జూ. ఎన్టీఆర్ కొత్త లుక్

ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూ. ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పలు యాడ్స్ ప్రమోషన్లో పాల్గొంటున్నాడు. ఇటీవల బాద్ షా లుక్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో లుక్ తో ఆకట్టుకున్నాడు.

ఈ లుక్ లో ఎన్టీఆర్ కళ్లజోడుతో ..బ్లాక్ బ్లేజర్ ధరించి కనిపించాడు. ఒక వైపు సీరియస్ గా లుక్ పెట్టడంతో అందరూ ఇది సినిమా షూటింగ్ ఫోజు అని అనుకుంటున్నారు. కానీ ఓ బ్రాండ్ ను ప్రకటన చేయడానికి ఈ లుక్ ఇచ్చాడని అంటున్నారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ మాస్ లుక్ లోనే ఊహించుకుంటున్నారు. కానీ సడెన్లీగా రిచెస్ట్ క్లాస్ లుక్ తో కనిపించి అదరగొడుతున్నారు. ఈ పిక్ నెట్టింట్లో పెట్టడంతో అది వైరల్ గా మారింది.