జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతి

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతి చెందాడు. ప్రమాదం జరిగి జనార్ధన్ కోమాలో ఉండగా.. ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ద్వారా ఎన్టీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు అభిమాని కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. ప్రాణాపాయస్ధితిలో ఉన్న అభిమాని కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ కుటుంబంలో సంతోషం నింపారు. ఫోన్ ద్వారా అక్కడే తనయుడు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అతని తల్లితో మాట్లాడి ధైర్యం చెప్పారు.

అధైర్య పడకుండా దేవుడిని నమ్మండి..దేవుడిపైన భారం వేయండి.. మేమంతా వున్నాం..త్వరలోనే తను కోలుకుని క్షేమంగా తిరిగి వస్తాడని మీరు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ అధైర్య పడొద్దని మీరు తన పక్కనే వుండి ధైర్యం చెప్పండని తన అభిమాని తల్లికి ధైర్యం చెప్పారు. జనార్ధన్ కోలుకోవాలని ఎన్టీఆర్ తో పాటు అతని అభిమానులు ఎంతగానో ప్రాధేయపడినప్పటికీ జనార్దన్ ప్రాణాలు మాత్రం దక్కలేదు. మంగళవారం సాయంత్రం జనార్ధన్ తుది శ్వాస విడిచాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్..త్వరలో కొరటాల శివ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు.