ఫస్ట్ టైం ఎన్టీఆర్ RRR కోసం ఆ పనిచేసాడు

ఆర్ఆర్ఆర్ మూవీ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కించిన ఈ మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లలో బిజీ బిజీ అయ్యారు. తాజాగా ఈ మూవీ తాలూకా ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ మూవీ దక్షిణాది భాషల్లో ఒక్క మలయాళం తప్ప తెలుగు, తమిళ, కన్నడంలో రిలీజ్ కానున్న తరుణంలో తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌. అలాగే హిందీలో కూడా సొంత వాయిస్‌నే వినిపిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ హిందీలో డబ్బింగ్‌ చెబుతున్న ఫొటో వైరల్‌ అవుతోంది. ఇంతవరకు ఎన్టీఆర్ హిందీ లో డబ్బింగ్ చెప్పలేదు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కోసం ఆ పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం , సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.