‘దాస్’ కోసం భీమ్ వస్తున్నాడు

విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దాస్ కా ధమ్కీ’. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో మార్చి 22 న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 17 న అట్టహాసంగా జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు. హైదరాబాదు – శిల్పకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ ఈవెంట్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నాడు.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు ఈ ధమ్కీని నిర్మించారు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించిన ధమ్కికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.