ఎన్టీఆర్‌.. చంద్రబాబు పై చెయ్యివేసి రాజకీయాల గురించి

NTR Biopic Poster
NTR Biopic Poster Bala Krishna , Raana

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, నిన్నటితో వరుసగా పది రోజులు పాటు షూటింగ్ జరుపుకోని.. మూడో షెడ్యూల్ ను కూడా పూర్తీ చేసుకుంది. మూడో షెడ్యూల్ లో ప్రధానంగా అసెంబ్లీకి సంబంధించిన కొన్ని రాజకీయ సన్నివేశాలు మరియు ఎన్టీఆర్ సినీ జీవితానికి సంబంధించి కొన్ని వ్యక్తిగత సన్నివేశాలను చిత్రీకరించారు.

ఎన్టీఆర్ చిత్రబృందం వినాయక చవితి సందర్భంగా నందమూరి అభిమానులను సర్‌ప్రైజ్‌ కి గురి చేసింది. ఇప్పటివరకు ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్స్ అన్ని ఒక్కోక్కరివి మాత్రమే విడుదల చేశారు. కానీ ఈ సారి మాత్రం ఎన్టీఆర్(బాలకృష్ణ) అండ్ చంద్రబాబు(రానా) కలిసి ఉన్న పోస్టర్ విడుదల చేయటం విశేషం. ఇప్పటికే ఈ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా యావత్తు తెలుగు ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పోస్టర్‌ లో ఎన్టీఆర్‌.. చంద్రబాబు పై చెయ్యివేసి రాజకీయాల గురించి చర్చిస్తున్నట్లు ఉండటం చాలా ఆసక్తిగా రేకెత్తిస్తోంది.

కాగా నవంబర్ కల్లా టాకీ పార్ట్ ని పూర్తి చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ట్యూన్స్ కూడా చాలా బాగా వచ్చాయని సమాచారం. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.