నాటు సాంగ్ లోని ఆ ఒక్క స్టెప్ కోసం ఎన్టీఆర్ – చరణ్ 18 టేక్స్ తీసుకున్నారట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. సంక్రాంతి కానుకగా జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు. రీసెంట్ గా నాటు సాంగ్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సాంగ్ లో చరణ్ , ఎన్టీఆర్ లు ఇద్దరు కూడా పోటాపోటీగా అదిరిపోయే స్టెప్స్ వేసి డాన్స్ ప్రియులను అలరించారు.

ఈ సాంగ్ కు సంబదించిన ఓ విషయాన్నీ ఎన్టీఆర్ మీడియా తో పంచుకున్నారు. నాటు సాంగ్ లో నేను చరణ్ కలిసి చేసిన స్టెప్ కోసం చాలా టేక్స్ తీసుకున్నాం. పాటలో కాళ్ళు ఎడమవైపు కుడివైపు ముందుకు వెనక్కు కదుపుతూ ఉండాలి. కాబట్టి 15 నుంచి 18 టేక్స్ వరకు చేయాల్సి వచ్చింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇద్దరి స్టెప్పులు కూడా సరిగ్గా వచ్చేవరకు వదిలిపెట్టలేదు. ఇద్దరం సమానం గా స్టెప్పులు వేయడం పై అందరూ పొగుడుతూ ఉన్నారు. ఆ విషయంలో రాజమౌళి ఆడియన్స్ పల్స్ ను చాల పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు అని అర్థమవుతుంది. ఆడియన్స్ కు ఏం కావాలో ఆయనకు చాలా బాగా అర్థమవుతుంది. అందుకే అయినా ఇండియాలో బిగ్గెస్ట్ డైరెక్టర్ గా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు.

YouTube video