ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ఎన్నారైలు

TSRTC
TSRTC

హైదరాబాద్‌: గత కొద్దిరోజులుగా జరుగుతున్న తెలంగాణ ఆర్టీసి సమ్మెకు మద్దతుగా ప్రవాస భారతీయులు నిలిచారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి మాజీ ఎంపి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తున్న తరుణంలోనే తెలంగాణ ఆర్టీసిని రక్షించాలి..రక్షించాలి అంటూ నినాదాలు చేశారు సభకు హాజరైన ఎన్‌ఆర్‌ఐలు. ఈ హఠాత్‌ పరిణామానికి ఆశ్చర్యపోవడం వినోద్‌ వంతయింది. ఈ నేపథ్యంలో కాసేపు సమావేశంలో గందరగోళం నెలకొంది. కాగా నిర్వహకులు సర్ది చెప్పడంతో ఆందోళన సర్దుమనిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/