తిరుమల ఎస్వీబీసీ ట్రస్టుకు ఎన్నారై రవి ఐకా రూ.4.20 కోట్ల విరాళం

వివరాలను వెల్లడించిన అదనపు ఈవో ధర్మారెడ్డి

Ramakrishna Prasad hands over Rs 4.20 crore donation check announced by NRI Ravi Ika to Thirumala Srivari SVBC Trust to Additional EO
Ramakrishna Prasad hands over Rs 4.20 crore donation check announced by NRI Ravi Ika to Tirumala Srivari SVBC Trust

తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ఎన్నారై రవి ఐకా రూ.4.20 కోట్ల విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్‌లో నివాసం ఉంటున్న ఎన్నారై రవి ఐకా తన ప్రతినిధి రామకృష్ణ ప్రసాద్‌ ద్వారా ఈ విరాళం ప్రకటించారు. తిరుమల తిరుపతి ఆలయం అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను రామకృష్ణ ప్రసాద్‌ అందజేశారు. అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ రవి ఐకా ఇప్పటికే పలు ట్రస్టులకు రూ.40 కోట్ల వరకు విరాళంగా అందించారని, ఎస్వీబీసీలో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ. 7 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు రవి ఐకా ముందుకొచ్చారని తెలిపారు. తొలి విడతగా రూ.4.20 కోట్లు అందజేశారని తెలిపారు. వీటితో అవసరమైన స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/