ఇక‌పై ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్ల వ‌ద్ద వంట గ్యాస్ తీసుకునే అవ‌కాశం

లోక్‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్రం స‌మాధానం

న్యూఢిల్లీ : వంట గ్యాస్ వినియోగదారులు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ వద్ద మాత్ర‌మే గ్యాస్ సిలిండర్ ను ఫిల్ చేయించుకునే అవ‌కాశం ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఇక‌పై తమకు నచ్చిన ఇత‌ర‌ డిస్ట్రిబ్యూటర్‌నూ ఎంపిక చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. లోక్ సభలో కొందరు ఎంపీలు అడిగిన ప్ర‌శ్న‌కు ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పింది.

ఎల్పీజీ వినియోగదారులు స్వయంగా డిస్ట్రిబ్యూటర్‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం ఉండ‌దా? అని ఎంపీలు అడిగిన ప్ర‌శ్న‌కు ఈ మేర‌కు కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరులశాఖ మంత్రి రామేశ్వర్ తెలీ సమాధానం ఇచ్చారు. వినియోగ‌దారులు త‌మకు నచ్చిన ఇత‌ర‌ డిస్ట్రిబ్యూటర్‌నూ ఎంపిక చేసుకునే అవ‌కాశాన్ని కల్పించేలా కేంద్ర స‌ర్కారు నిబంధ‌న‌ల్లో మార్పులు చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఇది అమ‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/