పదిలంగానే ఉన్న ఏసుక్రీస్తు ముళ్ల కిరీటం

crown of thorns
crown of thorns

పారిస్‌: మధ్యయుగపు కట్టడం నోటర్‌ డామ్‌ చర్చి…పారిస్‌లో అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఐతే ఆ మహాద్భుత క్యాథడ్రల్‌ ఎన్నో ఏళ్లుగా ఉంటున్న అనేక ప్రాచీన వస్తువులు అగ్నిలో కాలిబూడిదయ్యాయి. కానీ అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి మరెన్నో కళాత్మక వస్తువులను కాపాడుకున్నారు. చర్చిలో అత్యంత ప్రధానమైన ఆకర్షణగా నిలిచిన క్రౌన్‌ ఆఫ్‌ థార్న్‌ను కూడా ఆ సిబ్బంది కాపాడుకున్నారు. దీన్నే ముళ్ల కిరీటం అంటారు. ఏసు క్రీస్తుకు శిలువ వేసిన సమయంలో ఆయనకు ముళ్ల కిరీటాన్ని తొడుగుతారు. ఆ ముళ్ల కిరీటం ఇదే అని చరిత్రకారులు చెబుతున్నారు.
ఆ చర్చిలో ఉన్న గోతిక్‌ ఆర్కిటెక్చర్‌ కూడా విశేషమైంది. వాస్తవానికి నోటర్‌ డామ్‌ చర్చిలో అనేక మతపరమైన వస్తువులు కాలిపోయాయి. కానీ ఫైర్‌ఫైటర్స్‌ సాహసం వల్ల కొన్ని అవశేషాలు మిగిలాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/