చంద్రబాబు నివాసానికి సీఆర్డీఏ నోటిసులు

chandrababu, CRDA issues notices
chandrababu, CRDA issues notices

అమరావతి: ఏపి మాజీ సిఎం చంద్రబాబు ఉండవల్లి కరకట్ట వద్ద నివాసం ఉంటున్న భవనం అక్రమంగా నిర్మించిందేనని ఈరోజున ఉదయం సీఆర్డీఏ జోనల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నోటీసు అంటించారు. ఏపి సిఎం జగన్‌ అక్రమ కట్టడాలపై దృష్టిసారించారు. అయితే ఆ అక్రమ కట్టడాల జాబితాలో చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూడా ఉన్నట్లు తేలింది. దీంతో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసేందుకు కరకట్టలోని ఆయన నివాసానికి సీఆర్డీఏ అధికారులు చేరుకున్నారు. నోటీసులు జారీ చేసేందుకు సీఆర్డీఏ అసిస్టెంట్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి.. బాబు నివాసానికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేయించి పడగొట్టాలని లేనిపక్షంలో ప్రభుత్వమే కూల్చివేస్తుందని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులు ఆదేశించారు. నోటీసులకు వివరణ ఇవ్వకపోతే భవనాలు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/