బోధనపై ఏదీ శోధన!

Class Room (File)

తెలుగు మీడియంపాఠశాలలకు ఆదరణ క్రమేణా తగ్గితే ఆ పాఠశాలలు క్రమేణా రద్దుకాక తప్పదు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థులు లేక చాలా గామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతవేసిన చరిత్రను ఒక్కసారి మననం చేసుకోవాలి. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లీషు భాష తప్పనిసరి అయిపోయింది అన్నది మరోవాదన. దీనికై ఇటీవల జరిగిన అంతర్జాతీయ సర్వేలో 25దేశాలలో కేవలం ఐదు దేశాలలో మాత్రమే ఇంగ్లీషును ఉపయోగిస్తున్నాయి.రాష్ట్ర సాంకేతికరంగాల్లో పరిశోధనలకు ఇంగ్లీషు మాధ్యమం అవసరం.అయితే వాటికై ఇంగ్లీషు భాషవస్తే సరిపోతుంది తప్ప మీడియం అవసరం లేదు.

భా షాప్రయుక్త రాష్ట్రంగా ఏర్ప డిన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు బోధనా మాధ్యమంగా ఉంది. ఒక్క సారిగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఏకకాలంలో వచ్చే విద్యా సంవత్స రం నుండి ఇంగ్లీషు మీడియంలోనే విద్యాబోధన కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయంతో ‘ఆంధ్రాలో ఆంగ్లం సరే మరి తెలుగు? అనే సందేహం అటు భాషాభిమానుల్లోనూ, ఆంగ్లాన్ని ఆహ్వానించే వారిలోనూ నెలకొంది. విద్యారంగంలో విద్యాప్రమాణాలతో పాటు విద్యార్థులకు నేటి అవసరాలకనుగుణంగా సిలబస్‌ రూపకల్పన, బోధాన విధానం, పరీక్షా విధానం, మార్పులు, చేర్పులపై మాట్లా డాల్సింది, ఆచరించాల్సింది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘా లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు. అయితే క్షేత్రస్థాయిలో ఎవరితోనూ చర్చించకుండా, అభిప్రాయాలు, సర్వేలు చేపట్టకుండా ఏకపక్షంగా ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో వచ్చే విద్యాసంవత్సరం నుండి కేవలం ఆంగ్ల మీడియంలో బోధనను ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వం ఏం సాధించాలి అనుకున్నదో, ఏమి ఫలితాలు ఆశించిం దో, అందుకు తగిన మార్గాలపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమ యం ఆసన్నమైంది.

బోధనా మాధ్యమం అనే అస్త్రం నేడు ఉపా ధ్యాయుల నుండి రాజకీయ నాయకుల చేతికి చేరింది. తరగతి గది నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చ కాస్తా అసెంబ్లీ హాలుకు చేరి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో)లోని మెజారిటీ సంఘా లు ఏకాభిప్రాయంగా ఆంగ్ల మీడియాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే అదే సమయంలో తెలుగులో చదువ్ఞకోవాలనే ఆసక్తి, అభిమానం కలవారికి తెలుగు రాష్ట్రంలో అవకాశం లేకపోవడాన్ని ప్రశ్నిస్తూనే, తెలుగు మీడియం ఉన్న స్కూలును కనీసం మండల, పంచాయతీ పరిధిలో ఏదో ఒక చోట ప్రత్యేకంగా కొనసాగించాలని సిఫారసు చేసింది.

విద్యార్థుల సృజనాత్మకత, భావోద్వేగాలు, భావావేశాలు మాతృభాష ద్వారానే సులభంగా ప్రస్ఫుటమయ్యే అవకాశముంది. రాజకీయపరంగానూ ప్రభుత్వం, ప్రతిపక్షం, సాహితీవేత్తలు, భాషాభిమానులు, వివిధ వర్గాల మధ్య చర్చనీ యాంశంగా మారింది. అసలు ఇంగ్లీషు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ ఎవరూ చేయకపోవడం మన ఇక్కడ గమనిం చాలి. అయితే ఆంగ్లంపై మోజుతో తెలుగు మీడియాన్ని పూర్తిగా రద్దు చేయడానికి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. తెలుగు చదువ్ఞకోవాలనే ఆసక్తి కలిగిన ఒక్క విద్యార్థికైనా తెలుగురాష్ట్రంలో అవకాశమే లేకపోతే పొరుగు రాష్ట్రంలోని తెలుగు పాఠశాలల్లో చదువ్ఞకోవాల్సిందేనా? అది సాధ్యమేనా? అది వారి స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు కాదా? అనే అంశాలు పరిశీలించాలి. ఇప్పటికే మన రాష్ట్రంలో ప్రతి పంచాయతీ పరిధిలో ప్రైవేట్‌ పాఠశాలలతో సహా ఇంగ్లీషు మీడియం ప్రభుత్వ పరిధిలోని ఆదర్శ, కస్తూర్భా, గురుకుల, పురపాలక పాఠశాలల్లో సుమారు 34 శాతం (సుమారు 16వేల పాఠశాలల్లో) అందుబాటులో ఉన్నాయి.

వేలమంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలోనే విద్యనభ్యసిస్తున్నారు. మంచి ప్రతిభతో రాణిస్తున్నారు. చదువ్ఞ అంటేనే భయపడేవారు ఒక్కసారి గా ఇంగ్లీషు మీడియం అంటే మరింత భయపడి డ్రాప్‌ అవ్ఞట్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. వీరికి బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలు అంటే పట్టణ ప్రాంతాల్లోని ప్రముఖ కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ ప్రవేశాలు కల్పిస్తు న్నారు. సమాంతరంగా ఆంగ్ల, తెలుగు మీడియంలో బోధన కొనసాగుతుండటం వలన ఇంగ్లీషులో ప్రావీణ్యం, సామర్థ్యం అంచనాలకు తగిన విధంగా ఉండటం లేదనే విమర్శకూడా ఉంది.

అందుకే ప్రత్యేకంగానే ఇంగ్లీషు మీడియంపాఠశాలలతో సంబంధం లేకుండా తెలుగు మీడియం పాఠశాలలను కొనసాగించాలని ఫ్యాప్టో కోరుతోంది. తెలుగు మీడియంపాఠశాలలకు ఆదరణ క్రమేణా తగ్గితే ఆ పాఠశాలలు క్రమేణా రద్దుకాక తప్పదు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థులు లేక చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతవేసిన చరిత్రను ఒక్కసారి మననం చేసుకోవాలి.

ప్రపంచీ కరణ నేపథ్యంలో ఇంగ్లీషు భాష తప్పనిసరి అయిపోయింది అన్నది మరోవాదన. దీనికై ఇటీవల జరిగిన అంతర్జాతీయ సర్వేలో 25 దేశాలలో కేవలం ఐదు దేశాలలో మాత్రమే ఇంగ్లీషును ఉపయోగిస్తున్నాయి.రాష్ట్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు ఇంగ్లీషు మాధ్యమం అవసరం. అయితే వాటికై ఇంగ్లీషు భాష వస్తే సరిపోతుంది తప్ప మీడియం అవసరం లేదు. జాంబియా, టాంజానియ, ఘనా వంటి విదేశీ భాషలని వదిలి తమ దేశాలలో మాతృభాషని విద్యాబోధనకి ఉపయోగించడం ప్రారంభించాయి. యునెస్కో యూనిసెఫ్‌ వంటి సంస్థల పరిశోధనలో కూడా ఈ విషయం రుజువైంది. తెలుగు మాట్లాడటం మాయమైపోతే 10,15 ఏళ్ల వయసు వచ్చాక వారికి ప్రత్యేక శిక్షణ అవసరమయ్యే ప్రమా దముంది.

యునెస్కో పరిశోధన మేరకు 40సంవత్సరాల్లో మాతృ భాష వాడుకలో లేకపోతే పూర్తిగా అంతరించే ప్రమాదముందన్న వాస్తవం పాలకులు గుర్తించాలి. ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టడం ద్వారా కొన్ని తరాల పిల్లలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో ఆంగ్లంలో శిక్షణ ఇవ్వడానికి తగిన కార్యాచరణ ప్రణాళిక, తరగతి వారీగా సిలబస్‌ రూపకల్పన, పాఠ్యపుస్తకాల వంటి వాటిపై సరైన ప్రణాళిక లేకుండా అమలు చేయాలనుకోవడం సరైన పునాదులు లేని భవనంలా ఉంటుంది! దీనిపై తగిన ఆలోచన లేకపోవడం అన్యాయం. తరగతివారీగా ప్రతి ఏడాది అమలు చేస్తూ ఆంగ్ల మీడియంలో గుణాత్మక విద్యను అందిస్తే భావితరాలు ప్రభుత్వం ఆశించే లక్ష్యాలను చేరుకొనే అవకాశ ముంది. తెలుగు మీడియం ప్రత్యేక పాఠశాలల ద్వారా తెలుగును రక్షించే అవకాశముంది.

గాజుల నాగేశ్వరరావు
(రచయిత: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రోపాధ్యాయ సంఘం)

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/