నియంత్రించలేనిదంటూ ఏదీ లేదు

కరొనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ, దక్షిణ కొరియాలకూ ఈ ఆంక్షలు పెట్టాలని యోచిన

trump
trump

వాషింగ్టన్‌: అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచదేశాలను వణికిస్తున్న కరొనా వైరస్‌(కొవిడ్‌-19) పై స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి పెద్దగా భయపడాల్సిందేమీ లేదని ట్రంప్ అన్నారు. వైరస్ దాడి పెరిగేందుకు కొంతవరకూ అవకాశం ఉందని, కానీ నియంత్రించలేనిదంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే చైనా నుంచి అమెరికాకు రాకపోకలను నిషేధించామని.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ, దక్షిణ కొరియాలకూ ఈ ఆంక్షలు పెట్టాలని యోచిస్తున్నామని ట్రంప్‌ తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/