బోధకాదు – ఆచరణ ముఖ్యం

శ్రీరామకృష్ణ పరమహంస, రమణమహర్షి, గాంధీజీ, మహర్షి మలయాళస్వామి మొదలగు మహనీయులందరు తాము ఏమి ఆచరించారో దానినే బోధించారు. ఈనాడు బోధకుల సంఖ్య ఎక్కువైంది గాని ఆచరించే వారి సంఖ్య నానాటికి దిగజారిపోతున్నదని అందరు ఒప్పుకొంటారు. జీవిత విలవలు, నైతిక విలువలు అంటూ పెద్ద పెద మాటలు చెబుతూ వాటిని విద్యార్థుల్లో పెంపొందించాలని, యువకుల హృదయాల్లో నాటాలని, విద్యా ప్రణాళికల్లో ప్రవేశపెట్టాలని ఎందరెందరో మేధావ్ఞలు నొక్కి వక్కాణిస్తుంటారు. పత్రికలు ఆ మాటలను తాటికాయంత అక్షరాలతో ముద్రించి ప్రచురిస్తూంటాయి. సంతోషమే.
అయితే ‘తలకాయలెగిరిపోతాయి, ‘మెడలు తెగిపడతాయి, ‘నాలుకలు చీరేస్తాం, ‘నరుకుతాం, ‘నిలువ్ఞనా చీలుస్తాం, ‘తోలు తీస్తాం, ‘చర్మం ఒలుస్తాం, ‘చెప్పులతో కొట్టండి, ‘ముఖం మీద ఉమ్మేయండి, ‘అడ్డంగా నరకండి, ‘చీపుర్లతో తన్నండి అంటూ స్వామీజీలు యోగా గురువ్ఞలు, పెద్ద పదవ్ఞలనలంకరించిన రాజకీయ నాయకులు ఏ మాం జంకూ గొంకూ లేకుండా అంటుంటే వీరిని అన్ని టివి ఛానళ్లలో చూస్తున్న పిల్లలు, యువకులు, విద్యార్థులు ‘వీరేనా మనకు విలువలను గురించి బోధించేది? అని ముక్కుమీద వేలేసుకోరా? శాంతి, అహింసలను ప్రపంచానికే బోధించిన మనదేశంలో ఎవరిని గౌరవనీయులుగా, పూజ్యులుగా భావిస్తామో వారు అలాంటి మాటలు మాట్లాడితే, అంత దిగజారుడుగా వ్యవహరిస్తే ఎంత శోచనీనంయ. ఇలాంటి వారు ఇతరులకు బోధించటం, సంస్కరణకు నడుం బిగించడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ‘సంఘం అంటే నువ్వే, నువ్ఞ్వ మారితే సంఘం మారుతుంది. ముందు నువ్వే మారు అని జిడ్డుకృష్ణమూర్తి, ఓషో, సత్యసాయి మొదలగు ఆధునిక మహాత్ములందరు చెబుతారు.
సంఘసంస్కరణ కన్నా ముందు స్వయం సంస్కరణ చాలా అవసరం. అది రిగితే ఉపన్యాసాలతో, ఉద్బోధలతో ఎక్కువ అవసరం ఉండదు. మన జీవితమే ఇతరులకు ప్రత్యక్ష ప్రత్యేక, ప్రభావపర్తి బోధ అవ్ఞతుంది. తాను స్వయంగా ఆచరించని విషయాన్ని ఎంత గొప్ప బోధకుడు ఎంత రమ్యంగా చెప్పినప్పటికీ శ్రోతలు తాత్కాలిక ఆనందాన్ని పొందవచ్చు. చప్పట్లు చరచవచ్చుగానీ వారు ఏ మాత్రం మారరు, సంఘానికి ఏ మాత్రం మేలు కలుగదు.
కాబట్టి ముందు మారవలసింది బోధకులు, పెద్దలు, రాజకీయనాయకులు. ఆ తరువాత ఆప్రయత్నంగానే పిల్లలు వారి అడుగుజాడల్లో నడుస్తారు. టీచర్ బెత్తంతో విద్యార్థులను చితకబాదుతూ అహింసను గూర్చి పాఠాలు చెబితే అవి వారి చెవ్ఞలకెక్కుతాయా? తల్లిదండ్రులు అడగడుగునా అబద్ధాలు చెబుతూ మరొక వైపు సత్యనారాయణస్వామి వ్రతాలను చేయిస్తే పిల్లలకు సత్యం పలకాలన్న తలంపుగానీ, వ్రతాన్ని గూర్చిన సద్భావనగానీ కలుగుతుందా? రాజకీయ నాయకులు తెల్లని వస్త్రాలను ధరించి తమ హోదానకు వయసుకు తగని విధంగా దుర్బాషలాడితే, కోపంతో చిందులు వేస్తే వాటిని టివి ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం గావిస్తుంటే, పదే పదే చూపిస్తుంటే విద్యార్థులకు, యువకులకు హుందాతనమంటే ఏమిటో అర్ధమవ్ఞతుందా? అలాంటి వారికి సంఘం ప్రత్యేక గౌరమిస్తుంటే దాన్ని చూసిన పిల్లలు ఏమనుకొంటారు? ‘ఓహో, అలా కేకలెయ్యాయి. అలా తిట్టాలి, అలా తన్నాలి, అలా ఈడ్చి చెంపకు కొట్టాలి.
అలా చూపుడేలు చూపుతూ, ఊపుతూ ఇతరులను భయపెట్టాలి. అప్పుడే మనం వృద్ధిలోకి రాగలం, ఉన్నత పదవ్ఞలను అలంరించగలం, డబ్బును, గౌరవాన్ని సంపాదించగలం. లేకపోతే అనామకులుగా మిగిలిపోతాం. ఆత్మహత్యలే మనకు శరణ్యం. బయటకు చెప్పాల్సింది ఒకటి, లోపల చేయాల్సింది మరొకటి, ఈ సూత్రాన్ని పాటిస్తే ధన్యుం అని అనుకోరా ?విలువలను గూర్చి ఎవరు ఎంత గొంఉత చించుకొన్నా పాటిస్తే ధన్యులం అని అనుకోరా? విలువలను గూర్చి ఎవరు ఎంత గొంతు చించుకొన్నా వారు ఎంచుకొన్న బాటలో వారు నడువరా? ఆచరణే శక్తివంతమైన బోధ
- రాచమడుగు శ్రీనివాసులు
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/