గోవాను రక్షించుకునేందుకు వచ్చాను: మమతా బెనర్జీ

పనాజీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రోజుల గోవా పర్యటనలో భాగంగా రాజధాని పనాజీలో శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..గోవాకు తాము ముఖ్యమంత్రి అయ్యేందుకు రాలేదని, రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ దాదాగిరిని అడ్డుకునేందుకు వచ్చామని స్పష్టం చేశారు. స్పష్టం చేశారు.

ఢిల్లీ నుంచి చేసే దాదాగిరి ఇక నుంచి చెల్లదు. నేనేం బయటి వ్యక్తిని కాను. నేను ఇండియన్‌ని. దేశంలో ఎక్కడికైనా వెళ్తాను. బెంగాల్ నా మాతృ గడ్డ అయితే గోవా కూడా నా మాతృ గడ్డే. వాళ్లు(బీజేపీ కార్యకర్తలు) నా పోస్టర్లు చింపేశారు, అందుకే ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేప్పుడు నల్ల జెండాలు చూపించారు, వారికి నమస్తే చెప్పాను. నేను మళ్లీ చెప్తున్న. గోవాలో ముఖ్యమంత్రిని గెలుచుకునేందుకు రాలేదు. కేంద్ర ప్రభుత్వ దాదాగిరిని అడ్డుకుని గోవాను రక్షించుకునేందుకు వచ్చాను అని మమత అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/