భారత భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా ఎవరూ తాకలేరు

భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది

Rajnath Singh In Ladakh

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు లడఖ్‌లోని లేహ్‌లో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన చీఫ్ డిఫెన్స్‌ స్టాఫ్ జనరల్‌ బిపిన్ రావత్‌, ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవాణెలతో పాటు భారత సైన్యంతో చర్చించిన అనంతరం రాజ్‌నాథ్ మాట్లాడారు. దేశ గౌరవంపై దాడిని ఏమాత్రం ఉపేక్షించబోమని చెప్పారు. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, ప్రపంచానికి దేశం శాంతి సందేశాన్ని ఇచ్చిందని రాజ్‌నాథ్ చెప్పారు. అయితే, పరిస్థితి విషమించే పరిస్థితులు వస్తే దీటుగా జవాబు చెప్పడానికి భారత్‌ సిద్ధంగా ఉంటుందని అన్నారు. భారత భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా ఎవరూ తాకలేరని, ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని చెప్పారు. దేశ గౌరవం అన్నింటి కన్నా చాలా గొప్పదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించిందని, అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/