దక్షిణంపై ‘ఉత్తర’ రాజకీయాల పెత్తనం!

Indian Politics

దక్షిణం, ఉత్తరం రెండూ నాలుగు దిక్కుల్లో ఉన్న రెండు దిక్కులు. కానీ ఓ దిక్కు ఉన్న వారిపై ఇంకో దిక్కు వారు ఆధిపత్యం చెలాయించేందుకు చూస్తారనే విషయం అందరికీ తెలుసు. తెలియదనుకుంటే భారత్‌కు రావాల్సిందే. ఎందుకంటే నేటి భారతంలో ఆ పరిస్థితులు స్పష్టంగా కనిపి స్తాయి. ఈ విషయాన్ని అప్పుడే గుర్తించిన ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్‌ ఆనాడు దక్షిణ భారతీయులకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్‌ చేశారు.

ఎందుకనే విషయం సిద్ధాంతీ కరించారు. ద్రవిడులు దక్షిణభారతీయులనీ, ఉత్తర భారతీయులు ఆర్యులని వారి వర్ణం. సంస్కృతి తమది ఒకటి కాదని, కాబట్టి ఎప్పటికైనా ఉత్తరవాసులు, దక్షిణవాసులపై ఆధిపత్యం చెలా యించేందుకు అవకాశముందని పెరియార్‌ చెప్పారు.దక్షిణ భార తావనికి ప్రధాని, రాష్ట్రపతి ఉండాలని, ప్రత్యేక దేశంగా కొనసా గాలనే డిమాండ్లతో ఉద్యమించాలని నిర్ణయం కూడా తీసుకున్నా రు. అయితే నాడు భారతావని ఒక్కటిగా ఉండాలనీ, అప్పటికే ముస్లింలను పాకిస్థాన్‌ పేరుతో దేశం ఏర్పడటం వంటి పరిణా మాలు చూసిన అంబేద్కర్‌ పెరియార్‌తో మాట్లాడి ఒకే దేశంగా ఉంచేందుకు ఒప్పించారు.ఉత్తర, దక్షిణ భారతాలు అనికాకుండా ఒక్కటిగా ముందుకెళ్దామనే భావన తీసుకెళ్దామని సూచించారు.

దేశం ఒక్కటైనా భావనలు, వృత్తులు, ప్రవృత్తులు భిన్నంగా ఉంటాయి. మరి ముఖ్యంగా దక్షిణ, ఉత్తర భారతాల్లో పరస్పర విరుద్ధంగా ఉంటాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఉత్తర భారతీయులు దైవం, నమ్మకాలు బలంగా ఉన్నాయి. దక్షిణంలో నాస్తిక, ఆస్తిక భావనలు బలంగా ఉన్నాయి.ఉత్తరాదిలో భాష ప్రధానంగా హిందీ.దక్షిణాన ప్రధాన భాష అంటూ లేదు. తమి ళనాడులో తమిళం, కేరళలో మలయాలం, ఎపి, తెలంగాణాలో తెలుగు, కర్నాటకలో కన్నడం ఉన్నాయి. నేడు పాలకులు తమ హిందీ భాషను దక్షిణాన రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని బలంగా అడ్డుకున్నప్పటికీ ఇంకా బలమైన రూపంలో వివక్షకు దక్షిణ గురవ్ఞతుందని సునిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది.

నిధుల బదలాయింపు ఏమేరకు జరుగుతుంది? రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సినవి వస్తున్నాయా? తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా, దుగ్గరాజపట్నం ఎయిర్‌ పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌, పెట్రోలియం అండ్‌ ఆయిల్‌ రిఫైనింగ్‌ క్రాకర్స్‌ పరిశ్రమ, రైల్వేజోన్‌లు, బుందేల్‌ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజీ, విద్యాసంస్థలకు నిధులు, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయహోదా, ఇవన్నీ గొంతెమ్మ కోర్కెలు ఏం కాదూ. చట్టంలో ఉన్న అంశాలే. కాని ఇవేవీ అమలుకు నోచుకోలేదు.

ఉద్యోగాల్లోనూ వివక్షే. దేశానికి సంబంధించి ప్రభుత్వ అత్యున్నత ఉద్యోగాల్లో దక్షిణ భారతీ యులకు చోటు లేదు.నీట్‌,క్లాట్‌ అంటూ అన్నిపరీక్షలు జాతీయం చేశారు. రైల్వే ఉద్యోగాలు హిందీ భాషలో నిర్వహిస్తున్నారు. తద్వారా దక్షిణ భారతీయులు నష్టపోతున్నారు. దక్షిణాదికి రావా ల్సిన ఉద్యోగాలను బీహారీలు కొట్టుకుపోతున్నారు.యూపిఎస్‌సి, రైల్వే బోర్డులు, సుప్రీంకోర్టు బెంచ్‌లు దక్షిణభారతంలో ఉండా ల్సిన అవశ్యకతఉంది. కేంద్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగ నిర్దేశించిన ఓ సంస్థ. కేంద్ర,రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ ఆ సంస్థ నిధి. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాలకు 14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ఆదాయ పంపిణీ జరుగుతోంది.

కాని ఇకపై 15వ ఆర్థికసంఘం సిఫార్సులతో జరుగుతుంది. అయితే ఇప్పటివరకు 1971 జనాభా లెక్కల ప్రకారమే ఆదాయ వనరుల పంపిణీ జరిగింది. ఇప్పుడు 15వ ఆర్థికసంఘం గైడ్‌ లైన్స్‌ప్రకారం 2001 జనాభా లెక్కల ప్రకారం ఆదాయ పంపిణీ జరుగుతుంది. అప్పుడు మొదటగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే అప్పట్లో జనాభా నియంత్రణ విధానాలు పాటించి,గణనీయ కృషి చేసి జనాభాను నియంత్రించారు. అదే ఇప్పుడు శాపంగామారింది.

ఉత్తరరాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించలేదు. ఇబ్బడిముబ్బడిగా జనాభాను పెంచాయి. అది వారికి ఇప్పుడు మంచిదైంది. జనాభాను నియంత్రించినందుకు దక్షిణ రాష్ట్రాలను ప్రశంసించాల్సిన కేంద్రం నేడు శిక్షించేందుకు యోచిస్తుంది.ఎందుకంటే ఆదాయాల కేటాయింపు ఉత్తర రాష్ట్రా లకే ఎక్కువగా జరుగుతుంది. ఈ సందర్భంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలి. లేదంటే దక్షిణ రాష్ట్రాలు పోరుబాటపడతాయి.

  • అంబీర్‌ శ్రీకాంత్‌

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/