అమెరికాకు ఉత్తర కొరియా సూచన

Trump and Kim Jong Un
Trump and Kim Jong Un

సియోల్‌ : తమ దేశాధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌కు అమెరికా అధ్యక్షుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయటంపై ఉత్తర కొరియా ప్రతిస్పందించింది. కేవలం జన్మదిన శుభాకాంక్షలతో సరిపెట్టవద్దని, సాధ్యమైనంత త్వరలో అణు చర్చల ప్రక్రియను ప్రారంభించాలని సూచించింది. తమ డిమాండ్లను పూర్తిగా ఆమోదించే వరకూ తాము ఈ చర్చల్లో పాల్గొనబోమని హెచ్చరించింది. ఇరు దేశాధినేతలు 2018 జూన్‌ నుండి ఇప్పటి వరకూ మూడుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. గత ఫిబ్రవరిలో హనోరులో జరిగిన భేటీ అర్ధంతరంగా ముగియటంతో అణుచర్చలపై ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉ.కొరియా విదేశాంగశాఖ సలహాదారు కిమ్‌కైగ్వాన్‌ మీడియాతో మాట్లాడారు. శనివారం ట్రంప్‌ కిమ్‌కు పంపిన సందేశం అందిందని చెప్పారు. ప్రపంచానికి తెలిసినంత వరకూ ఇరువురి మధ్య వ్యక్తిగత సంబంధాలు సజావుగానే ఉన్నాయని ఆయన అన్నారు. తమ డిమాండ్లను పూర్తిగా అంగీకరిస్తేనే అణు చర్చలకు సహకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/