మిస్సైల్ టెస్టును కూతురితో వీక్షించిన కిమ్ జోంగ్ ఉన్

north-korean-leader-kim-jong-un-revealed-his-daughter-to-the-world

ప్యాంగ్యాంగ్‌ః ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జీవితమంతా రహస్యమే. తన గురించి గానీ, తన కుటుంబం గురించి ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త తీసుకుంటారు. తనకు ఎంతమంది పిల్లలు ఉన్నారన్న విషయం కూడా నిన్నమొన్నటి వరకు ప్రపంచానికి తెలియదు. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ త‌న కుమార్తెతో క‌లిసి మిస్సైల్ టెస్టును వీక్షించారు. ఆ ఫోటోల‌ను కిమ్ విడుద‌ల చేశారు. కిమ్ త‌న కుమార్తెను బ‌య‌ట‌కు తీసుకురావ‌డం ఇదే మొద‌టిసారి.

అయితే కిమ్ కూతురితో కలిసి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లడంపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్సైల్ టెస్ట్ ప్రోగ్రాంలో కిమ్ కుమార్తె కనిపించడం నాల్గోతరం వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారనడానికి సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా, శుక్రవారం ఉత్తర కొరియా హ్వాసాంగ్- 17 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్ చేసింది. దీన్ని పర్యవేక్షించేందుకు కిమ్ తన కూతురితో కలిసి వచ్చాడు. ఆ సమయంలో కిమ్ కూతురు తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఇదిలా ఉంటే కిమ్ కు ముగ్గురు పిల్లలు ఉన్నారని సెప్టెంబర్ లో జరిగిన ఉత్తర కొరియా నేషనల్ హాలిడే డే రోజు ప్రపంచానికి తెలిసింది. ఆ రోజు బయటకు వచ్చిన ఫొటోతో కిమ్ కు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారని క్లారిటీ వచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/