కిమ్‌ నుంచి నాకు చాలా అందమైన లేఖ అందింది

కొన్ని వారాల్లోనే ఐదుసార్లు ఆయుధ పరీక్షలు

Trump and Kim Jong Un
Trump and Kim Jong Un

హైదరాబాద్‌: ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు షాకులు మీద షాకులిస్తున్నాడు. ఈరోజు మరోసారి రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ఉత్తరకొరియా పరీక్షించింది. ఈ విషయాన్ని దక్షిణకొరియా సైన్యం ధ్రువీకరించింది. ఖకిమ్‌ నుంచి నాకు చాలా అందమైన లేఖ అందిందిగ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కొద్దిసేపటికే ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించడం గమనార్హం.
ఉత్తర కొరియా తూర్పు భాగంలోని హామంగ్‌ పట్టణానికి సమీపాన ఉన్న హ్యామ్‌గ్యాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి ఈ క్షిపణులను ప్రయోగించారు. 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను చేధించేందుకు వీటిని తయారు చేశారు. ఈక్షిపణులు గాల్లో మాక్‌ 6.1 వేగంతో 48 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించగలవు. క్షిపణి పరీక్షలను నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు కిమ్‌ హామీ ఇచ్చిన తర్వాత వరుసగా నిర్వహించిన ఐదో ప్రయోగం ఇది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/