కిమ్‌ చనిపోయారంటు ఊహాగానాలు

త్వరలోనే కిమ్ యో జోంగ్ రాజ్యాధికారం చేపడతారంటున్న జర్నలిస్టు

kim jang un
kim jang un, north korea president

సియోల్‌: ఇటివల ఉత్తర కొరియా సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ డే జంగ్ సహాయకుడు చాంగ్ సాంగ్ మిన్ చేసినవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఓ జర్నలిస్టు స్పందించారు. ఉత్తర కొరియాలో పర్యటించిన ప్రముఖ జర్నలిస్టు రాయ్ కేలీ తాజాగా మాట్లాడుతూ.. కిమ్ కోమాలో లేరని, ఆయన చనిపోయారని చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనమయ్యాయి. త్వరలోనే ఆయన సోదరి కిమ్ యో జోంగ్ రాజ్యాధికారం చేపట్టబోతున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంపై రాయ్ కేలీ మాట్లాడుతూ.. కిమ్ చనిపోయారని విశ్వసిస్తున్నట్టు చెప్పారు. దేశంలో జరుగుతున్న కార్యాచరణ పరమైన మార్పులు ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రజలకు విడుదల చేస్తున్న సమాచారం గందరగోళంగా ఉందని, దీంతో దేశంలో ఏదో జరగబోతోందన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. అంతేకాదు, నార్త్ కొరియా రెండో సుప్రీం లీడర్‌గా వ్యవహరించిన కిమ్ జోంగ్ ఇల్ చనిపోయిన విషయాన్ని కూడా అప్పట్లో ప్రభుత్వం కొన్ని నెలల తర్వాత వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా కేలీ గుర్తు చేశారు. కిమ్ సోదరి కనుక అధికార పగ్గాలు స్వీకరిస్తే ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని కేలీ పేర్కొన్నారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/