ప్రాణాంతక కరోనా రక్కసిని తుదముట్టించాంః కిమ్ జాంగ్ ఉన్

రెండు వారాలుగా జీరో పాజిటివ్

North Korea declares victory over Covid, reveals Kim Jong Un

ప్యోంగ్యాంగ్ః కొవిడ్ రక్కసిపై ‘మహోజ్వల విజయం’ సాధించాం అని త్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆసక్తికర ప్రకటన చేశారు. గత రెండు వారాలుగా దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా అధికారులు కిమ్ కు నివేదించారు.

ఈ నేపథ్యంలో కిమ్ ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజయం సాధించాం… ప్రాణాంతక కరోనా రక్కసిని తుదముట్టించాం” అని ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆయన సమావేశానికి హాజరైన సిబ్బంది, సీనియర్ అధికారులతో ఫొటోలు దిగారు.

కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఉత్తర కొరియాలో 48 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రకారం గత ఏప్రిల్ వరకు కరోనాతో 74 మంది మరణించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/