డల్లాస్‌ ‘నాట్స్’ ఆధ్వర్యంలో బాలల వేడుకలు

శాస్త్రీయ సంగీతం, నృత్యం, సినీ, జానపద విభాగాల్లో ఆట, పాటల పోటీలు

NATS children Festival
NATS children Festival

తెలుగు చిన్నారుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ నిర్వహించే బాలల వేడుకలు ఈ ఏడాదీ ఘనంగా జరిగాయి. నాట్స్ 12 వ వార్షిక సంబరాలను డల్లాస్‌ నాట్స్ విభాగం పెద్దఎత్తున నిర్వహించింది. టెక్సాస్‌లోని ప్లానో గ్రాండ్ సెంటర్‌లో బాలల సంబరాల్లో సుమారు 200 మందికి పైగా పాల్గొన్న చిన్నారులకు శాస్త్రీయ సంగీతం, నృత్యంతో పాటు సినీ, జానపద విభాగాల్లో ఆట, పాట లపై పోటీలు నిర్వహించారు. యునైటెడ్ స్టేట్స్ చెస్ ఫెడరేషన్ సహకారంతో నాట్స్ జాతీయ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ కూడా నిర్వహించింది.

డల్లాస్ విభాగం నుంచి రాజేంద్ర యనమదల, సౌత్ సెంట్రల్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ భాను లంక, చక్ కుందేటి, మాధవీ ఇందుకూరి, శ్రీకృష్ణ సల్లాం, ఆశ్విన్ కోట, రాజేంద్ర కాట్రగడ్డ, తిలక్, సుచింద్రబాబు, నాగిరెడ్డి మండల సంబరాల నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. సంజన కలిదిండి, రియా ఇందుకూరి, నవ్య వేగ్నేశ, అంజనా భూపతిరాజు లతో పాటు, యువ వాలంటీర్ల సాయంతో సంబరాలు జరిగాయి

నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ బాపు నూతి, నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, సంయుక్త కార్యదర్శి జ్యోతి వనం, జాతీయ సమన్వయకర్త అశోక్ గుత్తా, నార్త్ ఈస్ట్ జోన్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ యార్లగడ్డ సహకారం అందించారు. నాట్స్ బోర్డు నుంచి ఆది గెల్లి, ప్రేమ్ కలిదిండి, కిశోర్ కంచెర్ల, కిశోర్ వీరగంధం మద్దతు ఇచ్చారు. డల్లాస్ స్థానిక చాప్టర్ సభ్యులు కిరణ్ జాలాది, ప్రసాద్, మహిళా వేదిక నుంచి దీప్తి సూర్యదేవర, హెల్ప్ లైన్ టీం కవితా దొడ్డ సహకరించారు. నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసానికి నాట్స్ డల్లాస్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/