మూడు రోజులు నామినేషన్లకు సెలవు

rajat kumar
rajat kumar, telangana chief election commissioner


హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాల కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. ఐతే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 21వ తేదీ(హోలి), 23(నాలుగో శనివారం), 24(ఆదివారం)వ తేదీన సెలవులు కాబట్టి.. ఆ రోజుల్లో నామినేషన్లను స్వీకరించమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలకు పూర్తి స్థాయి సిబ్బంది కేటాయింపులు చేశామని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/