ప్రపంచకప్‌ భారత్‌ జట్టుకే!

team india, brian lara
team india, brian lara

న్యూఢిల్లీ: కోహ్లిసేన నేతృత్వంలో భారత క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ బ్రియన్‌ లారా పేర్కొన్నాడు. అన్ని పరిస్థితుల్లో రాణించడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని అందువలన టైటిల్‌ గెలుచెకోగలరని జోస్యం చెప్పాడు. భారత జట్టు ప్రస్తుతం సమతూకంలో ఉందని, భారత్‌ బలమైన జట్టు అని చెప్పడంలో సందేహం లేదని లారా పేర్కొన్నాడు.
ఐతే సొంతగడ్డపై ఆడుతున్న ఇంగ్లండ్‌ జట్టు సైతం ఈ సారి గట్టిపోటీ ఇవ్వగలదని లారా అన్నాడు. 1975లో ఈ టోర్నమెంటు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఇంగ్లండ్‌ గెలుచుకోలేదని..దీంతో ఆ జట్టు ఈ సారి గట్టిగానే ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని లారా అభిప్రాయం వ్యక్తం చేశాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/