వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి


విలియం కెలెన్, పీటర్ రాట్ క్లిఫ్, గ్రెగ్ సెమెంజాలకు నోబెల్

nobel-prize
nobel-prize

స్టాక్‌హోం:ప్రపంచస్థాయిలో నోబెల్ అవార్డుకున్న గుర్తింపు అంతాఇంతా కాదు. శాంతి, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యంలో అత్యున్నతస్థాయిలో ప్రతిభా పాటవాలు చూపినవారికి, విశేష కృషి సల్పిన వారికి ప్రతి ఏటా నోబెల్ పురస్కారంతో గౌరవిస్తుంటారు. ఈసారి వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకు విలియం జి కెలెన్, సర్ పీటర్ రాట్ క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెంజాలను నోబెల్ వరించింది. ఆక్సిజన్ ను కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై ఈ త్రయం విశేష పరిశోధన సాగించింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/