వైద్య రంగంలో స్వాంటే పాబోకు నోబెల్ అవార్డు

nobel-prize-in-medicine-awarded-for-research-on-evolution-swedish-scientist-svante-paabo

స్టాక్‌హోంః వైద్యరంగంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు స్వీడన్​కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వరించింది. మానవ పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ మేరకు నోబెల్ కమిటీ సెక్రెటరీ థామస్ పెర్ల్​మన్.. నోబెల్ విజేత పేరును ప్రకటించారు. మానవులకు అత్యంత సమీప జాతి భావించే నియాండెర్తల్స్, డెనిసోవాన్స్​ జీవుల జన్యువులు, ఆధునిక మానవుల జన్యువులను పోల్చుతూ చేసిన పరిశోధనకు పాబో నాయకత్వం వహించారు. రెండు జాతుల మధ్య కలయిక జరిగిందన్న విషయాన్ని ఈ పరిశోధన స్పష్టం చేసింది.వైద్య రంగంలో అవార్డు గ్రహీత పేరు ప్రకటనతో ఈ ఏడాది నోబెల్ సందడి మొదలైనట్లైంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయన, గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటిస్తారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/