భారత సంప్రదాయంలో నోబెల్‌ అందుకున్న అభిజిత్‌

Abhijit Banerjee & Esther Duflow
Abhijit Banerjee & Esther Duflow

స్వీడన్‌: భారతదేశ ఔనత్యాన్ని, ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ఇనుమడింపజేశారు అభిజిత్‌ బెనర్జీ. అర్థశాస్త్రంలో నోబెల్‌ బహుమతిని స్వీడన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆ దేశ రాజు గుస్టాఫ్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పేదరికపు విషకోరలనుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేందుకు తన అధ్యయనం ద్వారా అద్భుత పరిష్కారాలను సూచించినందుకుగానూ అభిజిత్‌ బెనర్జీ సహా ఆయన భార్య ఎస్తర్‌ డుఫ్లో, మరోక ఆర్థికవేత్త అయిన మైఖెల్‌ క్రెమర్‌కు కూడా ఈ నోబెల్‌ పురస్కారం లభించింది. స్వీడన్‌లో అట్టహాసంగా జరిగిన నోబెల్‌ పురస్కార ప్రదానోత్సవానికి అభిజిత్‌ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్‌ డుఫ్లో భారత సాంప్రదాయ దుస్తుల్లో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ధోతీ, బంద్‌గలా సూట్‌లో అభిజిత్‌, చీరకట్టు, బొట్టుతో వచ్చిన ఎస్తర్‌ మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు. పురస్కారం అందుకున్న అనంతరుం వేడుకకు హాజరైన వారందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/