టిఫిన్ తినటానికి సమయం లేదా?
ఆహారం-ఆరోగ్యం
మనలో చాలా మంది… పనుల్లో పడి టిఫిన్ తినకుండా ఒకేసారి భోజనం చేయచ్చులే అనుకుంటారు… అలా చేస్తే ఎసిడిటి, అల్సర్లు వంటి అనారోగ్యాలు దాడి చేస్తాయట… టిఫిన్ చేసుకునే సమయం లేని వాళ్ళు ఇవి ప్రయత్నించండి…
పెసలు, సెనగలు, పల్లెలు వంటిని ప్రొద్దున్నే నానబెట్టి రాత్రిపూట నీళ్లు పారబోసి అలా ఉంచితే సరి.. ఈ మొలకెత్తిన గింజల మీద కాస్త మిరియాల పొడి చల్లుకుని తినొచ్చు.. ఇలా నచ్చలేదండి తాలింపులో కొద్దిగా వెంయించి ఉప్పు, కారం వేసుకుని తినొచ్చు. ఎక్కువ వేయిస్తే పోషకాలు తరిగిపోతాఎండోయ్ ….
రవ్వ ఉప్మా కు అంత సమయం పట్టదు.. కనుక అటుకుల ఉప్మా చేసుకోవచ్చు.. అంత సమయం కూడా లేదంటే వేడి పాలల్లో అటుకులు , బెల్లం వేసి తినొచ్చు..
బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది… తీపి ఇష్టపడే వారు జామ్ తో, కారం ఇష్టపడేవారు సాస్ తో తినొచ్చు.. లేదా ఉల్లి, క్యాప్సికం , కొత్తిమీర తరిగి స్లైసుల మధ్యలో పెట్టుకుని తినొచ్చు… కాస్త నెయ్యి రాసి టోస్టర్లో అరనిముషం లో వేయించి తినొచ్చు..
ఓట్స్ ను నీళ్లతో ఉడికించి కొన్ని పాలు, కొద్దిగా బెల్లం వేసి తింటే పాయసాన్ని తలపిస్తుంది..
తీపి ఇష్టం లేనివారు ఉడికించిన ఓట్స్ చల్లారాక మజ్జిగ కలిపి తాగొచ్చు.. ఎండు ఖర్జూరం, జీడిపప్పు.. వీటిల్లో ఏదైనా రాత్రిపూట నాలుగు నానబెట్టి ప్రొద్దున్నే తినేస్తే శక్తి ఉంటుంది.. లేదనుకుంటే అరటి పండు , ఆపిల్ , ఖర్జూరాలు లాంటివైనా తినొచ్చు..
భోజనం చేసేవరకూ ఖాళీ కడుపుతో ఉంటే మాత్రం ఆనక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది..
ఆధ్యాత్మికం విశేషాల కోసం : https://www.vaartha.com/specials/devotional/