ఐపిఎల్‌పై కరోనా ఎఫెక్ట్‌.. నిర్వహణపై అనుమానాలు

Coronavirus effect on IPL 2020
Coronavirus effect on IPL 2020

ముంబయి: ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కారణంగా ఐపిఎల్‌ నిర్వహణ కష్టతరంగా మారుతుంది. ఇప్పటికే పలుచోట్ల కరోనా కేసులు నమోదవుతున్న వార్తల నేపథ్యంలో ఐపిఎల్‌ నిర్వహణ సందేహమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్వాహకులు మాత్రం అటువంటిదేమీ లేదని, యథావిధిగా ఐపిఎల్‌ పండుగ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఐపిఎల్‌ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ ‘ఐపిఎల్‌ పై కరోనా ప్రభావం లేదు. అయినప్పటికీ ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. షెడ్యూల్ ప్రకారం ఐపిఎల్‌ ఈనెల 29 నుంచి మే 24 వరకు జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు బిసిసిఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఇటువంటి ప్రకటనే చేశారు. ‘భారత్ లో క్రికెట్ సిరిస్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేదు. కరోనా వైరస్ అంశం చర్చకు రాలేదు. అందువల్ల ఐపిఎల్‌ తోపాటు దక్షిణాఫ్రికా భారత్ పర్యటన యథావిధిగా సాగుతుంది’ అంటూ గంగూలీ తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/