ఉప ఎన్నికపై మమతా బెనర్జీకి ఊరట

మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేసే ఉపఎన్నికను ర‌ద్దు చేయం.. కోల్‌క‌తా హైకోర్టు

కోల్‌క‌తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఊరట లభించింది. మ‌మ‌తా బెన‌ర్జీ.. భ‌బానిపుర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ఉప ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని వేసిన పిటిష‌న్‌ను కోల్‌క‌తా హైకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయ‌బోమ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. గురువార‌మే ఆ ఎన్నిక‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కోర్టు చెప్పింది.

భ‌బానిపుర్ నుంచి 2011, 2016లో దీదీ ప్రాతినిధ్యం వ‌హించారు. బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా తిబ్రేవాల్‌తో మ‌మ‌తా పోటీప‌డుతున్నారు. 41 ఏళ్ల తిబ్రేవాల్ కోల్‌క‌తా హైకోర్టులో లాయ‌ర్‌గా చేస్తున్నారు. మూడ‌వ‌సారి సీఎం అయిన మ‌మ‌తా బెన‌ర్జీ.. నందీగ్రామ్‌లో ఓడిపోవ‌డం వ‌ల్ల‌.. భ‌బానీపుర్ ఉప ఎన్నిక‌లో క‌చ్చితంగా ఎమ్మెల్యేగా గెల‌వాల్సి ఉంటుంది. అక్టోబ‌ర్ 3న ఫ‌లితాలు వెలుబ‌డుతాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/