పౌరసత్వ చట్టం పై స్టే నిరాకరించిన సుప్రీం

తదుపరి విచారణ జనవరి 22కి వాయిదా

supreme-court

న్యూఢిల్లీ: తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన పౌరసత్వ సవరణ చట్టం 2019ని నిలిపివేసేలా స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు మాత్రం అంగీకరించింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు విచారించింది. పిటిషన్లపై రెండు వారాల్లోగా స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 22కి వాయిదా వేసింది. పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లు వేసిన వారిలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, కమలహాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్, ఎంఐఎం అధినేత ఒవైసీ, ఇండియన్ ముస్లిం లీగ్, అసోం గణపరిషత్ సహా వివిధ పార్టీలు, వ్యక్తులు, సంస్థలు ఉన్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/