సెప్టెంబర్‌ 30 వరకు సామాజిక, మత కార్యక్రమాలు లేవు

yogi adityanath
yogi adityanath

లక్నో: జిల్లా క‌లెక్ట‌ర్లు, ఇత‌ర సీనియ‌ర్ అధికారుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ..రాష్ర్టంలో సెప్టెంబ‌ర్ 30వ తేదీ వ‌ర‌కు ఎలాంటి సామాజిక‌, మ‌త కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని తెలిపారు. క‌రోనా సంక్షోభ‌మే ఇందుకు కార‌ణమ‌ని వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆదేశించార‌న్నారు. శనివారం, ఆదివారం మార్కెట్లను మూసివేయడంతో సహా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించిందని అవస్థీ తెలిపారు.

మార్కెట్లను వారానికొకసారి మూసివేసేటప్పుడు అన్ని జిల్లాల్లో ఇంటెన్సివ్ శుభ్రతను, ఫాగింగ్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. క‌రోనా వైర‌స్ చైన్‌ను బ్రేక్ చేసేందుకు ఇటువంటి చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. కోవిడ్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారి వ‌ద్ద నుంచి పోలీసులు మార్చి చివ‌రివారం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు రూ. 70 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. అదేవిధంగా 69,765 వాహ‌నాల‌ను సీజ్ చేశారు. సెక్ష‌న్ 188 కింద 2.5 ల‌క్ష‌ల మందిపై ఎఫ్ఐఆర్‌ను న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. రాష్ర్టంలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 15,471 కి పెరిగింద‌న్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/