లాక్‌ డౌన్‌..ఢిల్లీలో ఓలా, ఊబర్‌ సర్వీస్‌లు నిలిపివేత

ఈనెల 31వ తేదీ వరకు ఓలా, ఊబర్‌ సర్వీసులు నిలిపివేత

ola, uber cabs
ola, uber cabs

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణలొ భాగంగా ఢిల్లీ నగరంలో ఈనెల 31వ తేదీ వరకు సర్వీసులు నిలిపి వేస్తున్నట్లు ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థలు ఓలా, ఊబర్‌ ప్రకటించాయి. రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ ప్రకటించడంతో ప్రైవేటు సర్వీసులు కూడా నిలిపివేయాలన్న సర్కారు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఇప్పటికే ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్చి 31వ తేదీ వరకు తమ క్యాబ్ లను బంద్ చేశామని ఆయా సంస్థలు ప్రకటించాయి. అత్యవసర సర్వీసులకు చెందిన కొన్ని వాహనాలను మాత్రమే నడుపుకునేందుకు కేంద్రం అనుమతించిందని ఓలా అధికార ప్రతినిధి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/