ప్రత్యేక రైళ్లను నడపడం లేదు

భారతీయ రైల్వేశాఖ వెల్లడి

  trains
trains

దిల్లీ: దేశంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లలో భాగంగా ప్రత్యేక రైళ్లను నడిపే ఆలోచనలో భారతీయ రైల్వే ఉందంటూ వస్తున్న వార్తలను ఉన్నతాధికారులు ఖండించారు. ఇవి కేవలం పుకార్లు మాత్రమే అని రైల్వేశాఖ తెలిపింది. మే 3 వరకు అంటువంటి ఏమి తాము చేయబోమని స్పష్టం చేసింది. దీనిపై భారతీయ రైల్వే ట్విట్టర్‌ లో స్పందించింది. మే 3 వరకు అన్ని ప్యాసెంజర్‌ రైళ్లను రద్దు చేసినట్లు పేర్కోంది. రద్దయిన రైళ్లలో బుక్‌ చేసుకున్న టికెట్‌ ఛార్జిల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపారు. అసత్యవార్తల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/