వారికి ఈ దేశంలో ఉండే హక్కేలేదు

దేశానికి నిప్పుపెట్టడానికి సిద్దంగా ఉన్నవారు ఎప్పటికీ దేశభక్తులు కాలేరు

Pratap Chandra Sarangi
Pratap Chandra Sarangi

సూరత్‌: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారిపై కేంద్రమంత్రి ప్రతాప్‌ చంద్ర సారంగీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత దేశ స్వాంతంత్య్రాన్ని, ఐక్యతను, వందేమాతరాన్ని అంగీకరించని వారికి ఈ దేశంలో ఉండే హక్కేలేదని అన్నారు. దేశానికి నిప్పుపెట్టడానికి సిద్ధంగా ఉన్నవారు ఎప్పటికీ దేశభక్తులు కాలేరని ఘాటుగా విమర్శించారు. పూర్వులు చేసిన దేశ విభజనకు ప్రాయశ్చిత్తమే పౌరసత్వ సవరణ చట్టమని సారంగీ పేర్కొన్నారు. ఇంకా సీఏఏ తీసుకొచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందరూ కృతజ్ఞతలు తెలపాలని అన్నారు. సీఏఏ చట్టంపై కాంగ్రెస్‌ లేనిపోని అపోహలను సృష్టిస్తోందని దుయ్యబట్టారు.

తాజా ఎపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/