కరోనా నియంత్రణ.. సిఎం యోగి కీలక ఆదేశాలు!

జూన్ 30 వరకు ప్రజలు గుమికూడటంపై ఆంక్షల పొడిగింపు

yogi adityanath
yogi adityanath

ఉత్తరప్రదేశ్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు రాష్ట్రలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్‌ సిఎం యోగి అదిత్యనాథ్‌ జూన్‌ 30వ తేదీ వరకు జనాలు గుమికూడటంపై ఆంక్షలు కొనసాగిస్తు కీలక అదేశాలు జారీ చేశారు. అంతేకకారాజకీయ ర్యాలీలు, ఫంక్షన్లపై నిషేధం ఉంటుందని ఆదేశాలలో పేర్కొన్నారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా ముస్లింలు గుమికూడటంపై కూడా నిషేధాన్ని విధించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ కుమార్ స్పందిస్తూ, జూన్ 30 వరకు ప్రజలు గుమికూడకుండా కఠిన చర్యలను తీసుకోవాలంటూ అధికారులను సిఎం ఆదేశించారని చెప్పారు. కరోనాను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/