ఇక్కడికి రాకుంటే ఏ సమస్యలు రావు

Trump
Trump

వాషింగ్టన్‌: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన అనేక మంది శరణార్థుశిబిరాల్లో దుర్భర పరిస్థితుల మధ్య బతుకుతున్నారు. శారణార్దులతో శిబిరాలన్నీ నిండిపోయాయి.ఈ పరిస్థితిపై ఇప్పటికే అనేక నివేదికలు ఆవేదన వ్యక్తం చేశాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యురిటీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వేల కొద్దీ శరణార్థులతో కిక్కిరిసిపోయిన శిబిరాలు ప్రమాదకరంగా మారుతున్నాయని తెలపింది అయితే ఈ విషయపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందిస్తు ”అవన్నీ తాత్కాలికంగా అప్పటికప్పడు ఏర్పాటు చేసిన శిబిరాలు. అక్కడ ఉండటం ఇబ్చందిగా ఫీల్ అయిన వారకి ..అమెరికాకు రావద్దని చెప్పండి. అప్పుడు సమస్యలన్నీ చిటికలో పరిష్కారమవుతాయి” అని వ్యాఖ్యానించారు. దీంతో ప్రస్తుతం ట్రంప్‌పై విమర్శల వర్షం కురుస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/