సీఏఏతో ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు

K. Laxman
K. Laxman

హైదరాబాద్‌: కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు ఎలాంటి నష్టం వాటిల్లబోదని బిజెపి అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మరియు ఇతర పార్టీలు సీఏఏను రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో మత ప్రతిపాదికన దేశాన్ని ముక్కలు చేసిందని కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు. ఇతర దేశాలలో అనేక ఇబ్బందుల పడిన పౌరులు మన దేశానికి శరణార్థులుగా వచ్చి స్థిరపడ్డారు అటువంటివారికి చట్టబద్దంగా సీఏఏ చట్టంద్వారా పౌరసత్వం పొందుతారని తెలిపారు. ఈ మేరకు ఆయన రోజు ఫేసుబుకులో సీఏఏ చట్టంపై పౌరులు అడిగిన పలు ప్రశ్నలకు సమధానాలిచ్చారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/