డబ్బులు ఖర్చు చేసుకుని హైదరాబాద్ రావద్దు

Harish-Rao
Harish-Rao

హైదరాబాద్‌ :టిఆర్‌ఎస్‌లో మంత్రి హరీశ్ రావుకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రజా నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇక సొంత నియోజక వర్గం సిద్ధిపేట విషయానికొస్తే… ఆయనను అక్కడి ప్రజలంతా తమ కుటుంబసభ్యుడిగానే భావిస్తారు. ఈ నేపథ్యంలో, ఆయనను కలవడానికి భారీగా ఖర్చు పెట్టుకుని అభిమానులు హైదరాబాదుకు వస్తుంటారు. ఇది హరీశ్ ను చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. దీంతో, హైదరాబాదుకు ఎవరూ రావద్దని, అందరం సిద్ధిపేటలోనే కలుద్దామని హరీశ్ సూచించారు. వారంలో నాలుగు రోజులు సిద్ధిపేటలో ఉంటానని… అప్పుడు తనను కలవాలని చెప్పారు. ఆసుపత్రికి రావాల్సిన పని ఉంటేనే హైదరాబాదుకు రావాలని కోరారు. డబ్బులు ఖర్చు చేసుకుని హైదరాబాదుకు రావద్దని, పని కాకపోతే మీ మనసు నొచ్చుకుంటుందని హరీశ్ ట్వీట్ చేశారు. తాను కూడా బాధ పడతానని చెప్పారు. మీరు నాకోసం హైదరాబాదుకు వస్తున్నారంటే… మీకోసం తాను సేవ చేయలేకపోతున్నాననే అర్థమని అన్నారు. ఎక్కడో తాను ఫెయిల్ అయినట్టే కదా అని చెప్పారు. వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని రావద్దని… మీరొచ్చే పనుల్లో 90 శాతం జరగని పనులు ఉంటాయని… అప్పుడు డబ్బంతా వేస్ట్ కదా అని అన్నారు. సిద్ధిపేటలోనే మనం కలుసుకుందామని సూచించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/