అస్సామీల హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం

పౌరసత్వ బిల్లుపై ఎవరూ ఆందోళన చెందవద్దు

PM Narendra Modi
PM Narendra Modi

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన నేపథ్యంలో, బిల్లును వ్యతిరేకిస్తూ అసోంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ప్రధాని మోడి స్పందిస్తూ..అసోం ప్రజల హక్కులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ‘అస్సామీ సోదర, సోదరీమణులకు నేను ఒక కచ్చితమైన హామీని ఇస్తున్నా. మీ హక్కులను మీ నుంచి ఎవరూ లాక్కోలేరు. పౌరసత్వ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడంపై ఎవరూ ఆందోళన చెందవద్దు. మీ హక్కులు, మీ గుర్తింపు, మీ అద్భుతమైన సంస్కృతిని మీ నుంచి ఎవరూ దూరం చేయలేరు. రానున్న రోజుల్లో ఇవన్నీ మరింత పరిఢవిల్లుతాయి’ అని తెలిపారు. అస్సామీల హక్కులను కాపాడేందుకు తాను, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడి చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/