కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం

ఈ సంవత్సరం ఎలాంటి కొత్త పథకాలు లేవు

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర పథకాలపై ఖర్చులు తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొత్త పథకాల నిధుల కోసం అభ్యర్థనలు పంపవద్దని అన్ని శాఖలకు తెలియజేశామని వెల్లడించారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీల ద్వారా మాత్రమే నిధులను ఖర్చు చేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని… అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మల చెప్పారు. ఒకవేళ తాజా నిబంధలనకు విరుద్ధంగా నిధులను కేటాయించాల్సి వస్తే… డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ (ఖర్చుల శాఖ) అనుమతి తీసుకోవాలని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-