వచ్చే ఆదివారం ‘నెఫ్ట్’ సేవలకు అంతరాయం

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ట్విట్టర్ లో వెల్లడి

No NEFT services on next Sunday
No NEFT services on next Sunday

New Delhi: ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించి అంతరాయం కలగనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు NEFT (నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌) సేవలను నిలిపివేస్తున్నట్టు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ట్విటర్‌ లో పేర్కొంది. సాంకేతిక కారణాలతో ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపింది. . NEFT పనితీరును మరింత మెరుగుపర్చడం కోసం మే 22వ తేదీన వ్యాపార వేళలు ముగిసిన తర్వాత సాఫ్ట్‌వేర్‌ను అప్ డేట్ చేస్తున్నారు పేర్కొంది. మే 23వ తేదీ ఉదయం 00.01 గంటల నుంచి (అంటే మే 22 అర్ధరాత్రి 12 గంటల నుంచి) మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని వెల్లడించింది. కాగా ఆర్‌టీజీఎస్‌ సేవలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/